Header Banner

ఈటీవీ విన్ తెరపైకి ప్రతి ఆదివారం చెప్పే కొత్తకథ.. ఆ కథల్లో ఫీల్ ను వర్కౌట్!

  Wed Apr 02, 2025 16:09        Entertainment

మొదటి నుంచి కూడా ఈటీవీ తన ప్రత్యేకతను చాటుతూ వస్తోంది. కథల ఎంపికలో ఈటీవీ ఎప్పుడూ గట్టి కసరత్తు చేస్తుంది. కుటుంబ నేపథ్యం .. బంధాలు .. అనుబంధాలు .. ఎమోషన్స్ ప్రధానమైన కథలను అందిస్తూ ఉంటుంది. ఈటీవీ ధారావాహికలన్నీ కూడా కుటుంబ సమేతంగా చూడదగినవిగా ఉంటాయి. రేటింగును బట్టి కథను తిప్పడం ఈటీవీలో దాదాపుగా చూడం. అలాంటి ఈటీవీవారు.. ఇప్పుడు ఈటీవీ విన్ ద్వారా మరో ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈటీవీ విన్ లో ఈ నెల 6వ తేదీ నుంచి 'కథాసుధ' ప్రసారం కానుంది. ఈ 'కథాసుధ'లో ప్రతి ఆదివారం ఒక కొత్త కథ వచ్చి చేరనుంది. ఏ కథకు ఆ కథగా ఇది ప్రేక్షకులను పలకరిస్తుంది. గతంలో 'బాలచందర్ బుల్లితెర కథలు' ఈ తరహాలోనే ప్రసారమైనట్టుగా గుర్తు. గతంలో ఏ కథకు ఆ కథగా 'కథా సంపుటి'గా బుక్స్ వస్తుండేవి. అలాగే ఇప్పుడు వివిధ రకాల కథలను 'కథాసుధ' ద్వారా అందించనున్నారు. నిజానికి వారానికి ఒక కథను అందించడం వలన .. ఆ కథల్లో ఫీల్ ను వర్కౌట్ చేసే సమయం దర్శకులకు దొరుకుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన మంచి కథల ఎంపిక జరుగుతుంది ... కథల్లో సాగతీతకు అవకాశం ఉండదు. కొత్త దర్శకులకు .. రచయితలకు .. నటీనటులకు అవకాశాలు పెరుగుతాయి. ఒక మంచి కంటెంట్ ను చూసిన ఫీల్ ఆడియన్స్ కి ఉంటుంది. ఈటీవీ విన్  తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమే.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli